చెమట చుక్క
చెమట చుక్కలతో
రైతులు వేసిన పంటలు,
పండితే నే పట్టెడు అన్నం.
తెల్లటి చుక్కలతో
మగువలు వేసిన ముగ్గులు,
కుదిరితే నే ఇంటికి అందం.
పుట్టలోని రాణీ చీమ సేవలో
శ్రమిస్తున్న చలి చీమలదండు.
గద్దె మీది నాయకుడి సేవలో
తరిస్తున్న అధికారుల దండు.
చీమల బారు లాగా
వరుస బాట
పాటిస్తే ఉండదు గా
తొక్కిస లాట
Comments
Post a Comment