Posts

అడివి రాజు

 రచన: గోలి శ్రీనివాస శాస్త్రి  కథ : కరెంట్ షాక్. “ శ్రీ టి.ధర్మారావు…మినిస్టర్ ఆఫ్ స్టేట్” అని బయట బోర్డు చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు అడవిరాజు . “ఎవరండీ మీరు? ఏం కావాలి?”   పేషీ లో కూర్చున్న వ్యక్తి అడిగాడు. “నా పేరు అడవిరాజు. మాది ఎర్రగొండ పాలెం దగ్గర‘కుంకుడు చెట్టు’ తండా. మినిస్టర్ గారి తో పని ఉండి వచ్చాను.” అన్నాడు అడవిరాజు. లోపల జరుగుతున్న మీటింగ్ అయిపోగానే పంపుతాను అని కూర్చో మని చెప్పాడు ఆ వ్యక్తి. ******* “ ఏమి అడవి రాజు, ఎలా ఉన్నావు? ఏంటి మన తండా విశేషాలు” అని ఆప్యాయంగా పలకరించారు మినిస్టర్ గారు.  “మా ఊరి గురించిన ఒక సమస్య, మీకు చెప్పుకుంటే తప్పకుండా చేస్తారని వచ్చాను” అన్నాడు అడవిరాజు. “రాజూ మీరు, మీ చుట్టూ ఉన్న ఇతర తండాల ప్రజలు నేను గెలవడానికి ఎంతో సహాయం చేశారు. నా వల్ల అయ్యే పని ఏదైనా తప్పకుండా చేసి పెడతాను”అన్నారు మినిస్టర్ గారు. “సార్ , మీకు తెలిసిందేగా! మా ఊరు కృష్ణా నదికి కూత వేటు దూరం లో నల్లమల అటవీ ప్రాంతం లో ఉంటుంది. రెండు భారీ నీటి ప్రాజెక్టుల మధ్య ఉన్నా కూడా, మా ఊరికి చెందిన భూమికి సాగు నీటి ఏర్పాటు లేదు. అంతా వర్షాధార వ్యవసాయమే. పంటలు...

హైకూలు

 హైకూలు రచన: శ్రీనివాస శాస్త్రి . 19.04.2025 # ప్రగతికి చిహ్నం  దరికి చేరుతున్న ధనం  కాలుతున్న ఇంధనం  కరువు లోనే జనం  ***  సామాజిక మేథావి చర్చల్లో అనర్గళం  తప్పులు ఇటుంటే  నోటికి తాళం  *** భార్యామణి మా రాజ్యానికి రాణి  పక్కన లేకపోతే  నా విలువ ఏగాణి  **** వాలిన లోహపు విహంగం  దిగిన ప్రజా నాయకుడు  పేదలకోసం ఉద్యమం జేజేలు కొడుతూ మనం *** ప్రజా ధనం దోపిడీ  దాచు కోవడం..ఒకప్పుడు పెట్టుబడి తో మరింత  పెంచుకోవడం …ఇప్పుడు  ****  చుట్టూ ప్రవాహం. మధ్యలో   పైన ఆకాశం క్రింద పాతాళం. *** చుట్టూతా జనం  ఉన్నా ఎందుకో ఒంటరితనం మనసు లో మౌనం *** తన తో స్నేహం ఆ కాలంలో వ్యామోహం  ఇప్పుడది గతం. *** అందరితో స్నేహం ఉండాలని నా అభిమతం  ఇంతలో నిర్వేదం.  *** దుఃఖ మోడుతూ  తపిస్తున్న హృదయం  మానని గాయం.  ****** టకటకా మోత   వణుకుతున్న గుండె పట్టాలపై రైలు. ***************  కొండ పై గుడి  మెలికల రాదారి. చుట్టిన పాము. ************** చీకట్లో సడి  మది లో అలజడి  దూకిన...

బెదురు

 అంశం: బెదిరి పోతున్న మనిషి  సంధ్య వేళ వరకు ఆడిపాడి  నిశి రాత్రి చీకటి లో  అదృశ్యమైన ఆరేళ్ల పసిపాప  మిన్నాగుల విషపు గాట్లకు  బలి అయ్యి పొద్దున్నే  చినిగి పోయి కనిపించ గా హతాసులై న జనం.. రోదన మరచి చేష్టలుడిగిన  ఆడ పిల్ల తల్లి తండ్రులు  ఇప్పుడు మనుషులంటే బెదిరి పోతున్నారు…. ప్రకృతి నే ఎదిరించి గాలి లో కనిపించని రహదారులు నిర్మించిన మనిషి మేధ కు  పెను సవాలుగా మారుతూ… యముని మహిషపు  కాళ్ళ గిట్టల కింద చిక్కుకొని  ఒక్కొక్కటిగా కూలిపోతున్న లోహపు విహంగాలు… క్షణాల్లో మాంసపు గుట్టలు గా మారుతున్న  మనుషుల శరీరాలు… తలచుకొని గగుర్పాటుతో ప్రయాణం అంటే బెదిరిపోతున్న మనిషి. లంచగొండి అధికారులు  ధనదాహపు నాయకులు  వాళ్లు పెంచి పోషించిన  రియల్ ఎస్టేట్ వ్యాపారుల  కాగితాల వలలో చిక్కి.. సంపాదించింది.. సంపాదించబోయేది .. అంతా ధారపోసి… బ్రతుకును తాకట్టు పెట్టి . తెలియక చెరువు శిఖంలో ఇల్లు  కొన్న మిడిల్ క్లాస్ జీతగాడు.. మొన్నటి వరదలు మళ్లీ  ముంచేస్తే ,బతకడానికి బలుసాకును ఎక్కడ  అడుక్కోవాలో తెలియక బెదిరి పొతున్నాడు. బయ...

శివం సత్యం

  అంశం:సర్వం శివమయం శీర్షిక: శివ పూజ  రచన: శ్రీనివాస శాస్త్రి  ది. 27.02.2025. 🙏 శివుని నమ్ముకో నరుడా  హరుని గొలువరా నరుడా శివుని నమ్మితె నీకు  చింతలన్నియు దీరు  హరుని గొలిచిన నీకు  శాంతి సౌఖ్యము గల్గు..  శివుని నమ్ముకో నరుడా  హరుని గొలువరా నరుడా.. మంగళా కారుడిని  మదిలోన తలచుకొని శివరాత్రి జాగరము  అభిషేక అర్చనలు అరయమ్ము గా నీవు అనుసరించితి వేని సుఖ సంపదలనిచ్చు నరుడా స్వామి సర్వమంగళుడురా నరుడా. శివుని నమ్ముకో నరుడా  హరుని గొలువరా నరుడా….. ఈతిబాధలతొ నీవు  ఇసుమంత భయపడక పరమేశ్వరుని ముందు  శరణంటు తలదించి  వినయమ్ము తో నీవు  మోకరిల్లితి వేని  రోగాలు బాపురా నరుడా  స్వామి భోగాలు కలిగించు నరుడా  శివుని నమ్ముకో నరుడా  హరుని గొలువరా నరుడా. మల్లి జాజుల పేరు  మాలలే పనిలేదు మారేడు ఆకులను  కోసి దెచ్చిన చాలు. పన్నీరు పరిమళ  ద్రవ్యాలు లేకున్న. శివశివా యనుచును  జలముపోసినచాలు. పెట్టడానికి పట్టు వలువలే పని లేదు  భవభవా యనుచూ  భస్మముంచిన చాలు. పొంగి పోతాడురా నరుడా.. స్వామి నినువీడ...

ఏ కులం

 కథా శీర్షిక: మనిషి కులం  “ఇకనైనా కోపం మాని భోజనం చెయ్యి జానకీ. రెండు రోజులనుండీ ఏమీ తినకుండా ఆ మొబైల్ మెసేజ్ చూస్తూ అలానే పడుకున్నావు” అంటున్న రామ శర్మ గారి వైపు ఆమె తీక్షణం గా చూసింది.  “నీకే కాదు నాకు కూడా కోపం వచ్చింది. ఆ మాట కోస్తే ఆ మెసేజ్ చదివిన తరువాత ఏ తల్లి దండ్రులకైనా అలానే ఉంటుంది. మనమా పెద్దవాళ్ళం అయ్యాము. మన  ఆరోగ్యం కూడా ముఖ్యం కదా” అని భార్య ను అనునయించడానికి ప్రయత్నిస్తున్నారు రామ శర్మ గారు. విన్పించుకోనట్టు కళ్ళు మూసుకుని పడుకుంది జానకమ్మ. పక్కనే ఉన్న వాలు కుర్చీలో కూలబడి ఆమెకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నారు శర్మ గారు. కొడుకు పంపిన వాట్సప్ మెసేజ్ మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. “అమ్మా నాన్నలకు నమస్కారములు. ఇక్కడే అమెరికాలో నాతో కలిసి పనిచేస్తున్న డాక్టర్ రమ్యారావు నేను చాలా కాలం గా ప్రేమించు కుంటున్నాం. ఇద్దరికీ గ్రీన్ కార్డులు వచ్చాయి. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. మీకు ఇన్నిరోజులనుండీ చెప్పాలంటే భయం వేసింది. మీ శ్రోత్రియ జీవన విధానాన్ని చిన్నప్పటినుండీ చూసిన వాణ్ణి కనుక, మా కులాంతర వివాహాన్ని మీరు ఇష్టపడరు...

కొడుకు పై ప్రేమ

 కథ : తల్లి _ కొడుకు “మీరు మీ అబ్బాయి స్కూలు డైరీ రోజూ చూడాలండి, లేకపోతే హోమ్ వర్క్ ఏదన్నా మిస్ అవుతే మీ వాడిని క్లాస్ లో పీరియడ్ అంతా నిలబెట్టేస్తారు వాడి మిస్ లు”..  పోయిన సారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి చింటూ గాడి స్కూలు బాగ్ సర్దుతూ డైరీని కేసువల్ గా తెరిచింది రాజీ.. ఒక్కసారిగా గుండె గుభేల్.. చింటూ గాడు రాత్రి అన్నీ హోమ్ వర్క్లు చేశాడు కానీ మ్యాథ్స్ హోమ్ వర్క్ చేయలేదు.. వాడికి మొదటినుండీ నంబర్స్ అన్నా  టేబుల్స్ అన్నా ఇంట్రెస్ట్ ఉండదు.. అనుకుంటూ..  గుడి దగ్గర పంజరం లో చిలక ఎదురు పేక దొంతర లోనుండి ఒక్క కార్డు తీసినట్లు గా చింటూ నోట్ బుక్ దొంతర లో నుండి స్క్వేర్ రూల్ వర్క్ బుక్ వెతికి టక్కున ఓపెన్ చేసింది రాజీ... ఇంకా నిద్ర మత్తు లోనే ఊగుతూ  “ఊఉఊ ఈ రోజు హార్లిక్స్ వద్దు మమ్మీ నాకు బూస్ట్ కావాలి”  అని ఇప్పటిదాకా మారాం చేసి సాధించిన బూస్ట్ పాల గ్లాస్ ను ఒక చేత్తో పట్టుకుని తాగ డానికి రెడీ అవుతున్నాడు చింటూ..  “ఒరేయ్ రాత్రి మ్యాథ్స్ హోమ్ వర్క్ ఉందని చెప్పలేదేం” అంటూ హడావుడిగా వాడి చేతిలో పెన్సిల్ పెట్టింద...

సెల్లో పాఖ్యానం

 కథ: సంక్రాంతి సెలవులు.. సంక్రాంతి కి స్వంత ఊరికి వెళ్ళడానికి మూడునెల్లముందు నుండీ టిక్కెట్లు బుక్ చేసుకుని, ఆఫీసు లో బాస్ ని అతికష్టం మీద ఒప్పించి కుటుంబతో సహా ఊరికి ప్రయాణమయ్యాడు జయరాం. రైల్వే స్టేషన్ లో జనాన్ని తోసుకుంటూ, పిల్లలతో సహా అందరూ తలా ఒక లగేజీ మోసుకుంటూ బోగీ వెతుక్కుని ఎక్కేసరికి తలప్రాణం తోకొచ్చింది… రైలు ఇప్పుడే సిటీ దాటి నట్టుంది ,వేగం అందుకుంది . ఇంక రెస్ట్ తీసుకుందామని బెర్త్ మీద నడుం వాల్చి మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు జయరాం.. “ప్రయాణం లో అయినా మాతో కాసేపు సరదాగా మాట్లాడొచు కదా.. ఎప్పుడూ ఆ మొబైల్ తోనే గడపకపోతే, పిల్లలకు కూడా ఏమి తోచడం లేదు”.. అంది రమ. “రమా, నేను ఫోన్ చూస్తున్నది కాలక్షేపానికి కాదు, కరెంట్ బిల్లు దగ్గరనుండి క్రెడిట్ కార్డు బిల్లుల వరకు ఫ్లైట్ టికెట్స్ నుండి బస్ టికెట్స్, ఓలా రైడ్లు, ఆటో బుకింగ్లు, చివరికి ఆఫీసు మెయిల్స్, అన్నీ ఇప్పుడు ఫోన్ యాప్ ల ద్వారానే కదా, ఈరోజున మన చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి, మొబైల్ లేకపోతే ఏదో శరీరం లో పార్ట్ లేనట్టుగా ఉంటుంది..ఏమీ తోచదు”అన్నాడు జయరాం.   “అవును వీటితోపాటు యూ ట్యూబ్ రీల్స్, వాట్సా...