అడివి రాజు
రచన: గోలి శ్రీనివాస శాస్త్రి కథ : కరెంట్ షాక్. “ శ్రీ టి.ధర్మారావు…మినిస్టర్ ఆఫ్ స్టేట్” అని బయట బోర్డు చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు అడవిరాజు . “ఎవరండీ మీరు? ఏం కావాలి?” పేషీ లో కూర్చున్న వ్యక్తి అడిగాడు. “నా పేరు అడవిరాజు. మాది ఎర్రగొండ పాలెం దగ్గర‘కుంకుడు చెట్టు’ తండా. మినిస్టర్ గారి తో పని ఉండి వచ్చాను.” అన్నాడు అడవిరాజు. లోపల జరుగుతున్న మీటింగ్ అయిపోగానే పంపుతాను అని కూర్చో మని చెప్పాడు ఆ వ్యక్తి. ******* “ ఏమి అడవి రాజు, ఎలా ఉన్నావు? ఏంటి మన తండా విశేషాలు” అని ఆప్యాయంగా పలకరించారు మినిస్టర్ గారు. “మా ఊరి గురించిన ఒక సమస్య, మీకు చెప్పుకుంటే తప్పకుండా చేస్తారని వచ్చాను” అన్నాడు అడవిరాజు. “రాజూ మీరు, మీ చుట్టూ ఉన్న ఇతర తండాల ప్రజలు నేను గెలవడానికి ఎంతో సహాయం చేశారు. నా వల్ల అయ్యే పని ఏదైనా తప్పకుండా చేసి పెడతాను”అన్నారు మినిస్టర్ గారు. “సార్ , మీకు తెలిసిందేగా! మా ఊరు కృష్ణా నదికి కూత వేటు దూరం లో నల్లమల అటవీ ప్రాంతం లో ఉంటుంది. రెండు భారీ నీటి ప్రాజెక్టుల మధ్య ఉన్నా కూడా, మా ఊరికి చెందిన భూమికి సాగు నీటి ఏర్పాటు లేదు. అంతా వర్షాధార వ్యవసాయమే. పంటలు...