హైకూలు
హైకూలు
రచన: శ్రీనివాస శాస్త్రి .
19.04.2025
#
ప్రగతికి చిహ్నం
దరికి చేరుతున్న ధనం
కాలుతున్న ఇంధనం
కరువు లోనే జనం
***
సామాజిక మేథావి
చర్చల్లో అనర్గళం
తప్పులు ఇటుంటే
నోటికి తాళం
***
భార్యామణి
మా రాజ్యానికి రాణి
పక్కన లేకపోతే
నా విలువ ఏగాణి
****
వాలిన లోహపు విహంగం
దిగిన ప్రజా నాయకుడు
పేదలకోసం ఉద్యమం
జేజేలు కొడుతూ మనం
***
ప్రజా ధనం దోపిడీ
దాచు కోవడం..ఒకప్పుడు
పెట్టుబడి తో మరింత
పెంచుకోవడం …ఇప్పుడు
****
చుట్టూ ప్రవాహం.
మధ్యలో
పైన ఆకాశం క్రింద పాతాళం.
***
చుట్టూతా జనం
ఉన్నా ఎందుకో ఒంటరితనం
మనసు లో మౌనం
***
తన తో స్నేహం
ఆ కాలంలో వ్యామోహం
ఇప్పుడది గతం.
***
అందరితో స్నేహం
ఉండాలని నా అభిమతం
ఇంతలో నిర్వేదం.
***
దుఃఖ మోడుతూ
తపిస్తున్న హృదయం
మానని గాయం.
******
టకటకా మోత
వణుకుతున్న గుండె
పట్టాలపై రైలు.
***************
కొండ పై గుడి
మెలికల రాదారి.
చుట్టిన పాము.
**************
చీకట్లో సడి
మది లో అలజడి
దూకిన పిల్లి.
****
కూడిన జనం
పోటెత్తిన మైదానం
పోరు సంకేతం.
**************
Comments
Post a Comment