చలికాలం
ఎర్రటి ఎండైనా, వడగండ్ల వానైనా
ఎముకలు కోరికే చలైనా
రెక్కాడక డొక్కాడని
బ్రతుకుల లో, ఇది అంతా
కలికాలమే! చలి కాలము వారెరుగరు!
నాగలెత్తి, దుక్కి దున్ని
ఒంటి మీదను బట్ట ఎరుగక,
డొక్క మంటనే ఒడలు కాచుకు,
పంట వరకూ కాపు కాచే
రైతు బ్రతుకు న
ఆరుగాలమే! చలి కాలము ఆయనెరుగడు!
పగలు రాత్రులు సమయ మెరుగక
యంత్రాల రొదల మధ్యనే,
జీవితాన్ని చివరి వరకూ
ధార పోసే శ్రామికునికి,
ప్రతి కాలము
కష్ట కాలమే! చలికాలం ఆయనెరుగడు!
పొట్ట కూటికి ఊరు వదలి,
కన్న పేగుల కాడి వదలక
కంతలున్న ఇళ్లనుండి
చలి పులికి ఎదురు వెళ్ళే,
కూరలమ్మికి, పనుల అవ్వకి,
పూలమ్మికి, పాలమ్మికి,ఎపుడైనా
పని కాలమే! చలి కాలం వారలెరుగరు!
కోటలోని,పట్టు పరుపుల
ఒడుల లోపల మహా రాజులు
వారి కాంతలు, చెంత పేర్చిన
నెగడు మంటలు,
వారి సందిట వేడి
కాం
తులే! చలి నెప్పుడు వారు ఎరుగరు!
Comments
Post a Comment